ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల విషయంలో చాలా సీరియస్ గా ఉంది. రైతన్నల లోగిళ్ళలో ముందే వచ్చాయి దీపావళి కాంతులు. ఒకే రోజు,వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌,వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు,వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. నేడు క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి 11 గంటలకు రైతుల ఖాతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ జమ చేస్తారు.

మూడు పథకాల ద్వారా రైతన్నలకు లబ్ది చేకూరే అవకాశం ఉంది. వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం, వైఎస్సార్‌ యంత్ర సేవా పథకాల క్రింద రూ. 2,190 కోట్ల లబ్ది చేకూరుతుంది అని ప్రభుత్వం తెలిపింది. ఇది వరకే ఆగష్టులో రెండో విడత వైఎస్సార్‌ రైతు భరోసా అందించారు. పీఎం కిసాన్‌ క్రింద జమ చేసిన సాయం రూ. 977 కోట్లు పోను, మిగిలిన మొత్తం రూ. 1,213 కోట్లు నేడే బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: