తెలంగాణాలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ విషయంలో చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ అందరికీ అందించే విధంగా సిద్దమైంది. వ్యాక్సిన్ కొరత లేకపోవడం, సిబ్బంది కూడా వ్యాక్సిన్ కి సంబంధించి అవగాహన తో ఉన్న నేపధ్యంలో ప్రతీ ఒక్కర్కి వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఈ నేపధ్యంలో తాజాగా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రాకపోతే ఏం చేయాలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

వ్యాక్సిన్ తీసుకొని వారికి రేషన్ అలాగే పెన్షన్ కట్ చేయాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం వెల్లడించింది. వ్యాక్సిన్ పై అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. ఇక కేంద్రం కూడా వ్యాక్సిన్ విషయంలో చాలా సీరియస్ గా ఉంది. ఫార్మా కంపెనీలు కూడా వ్యాక్సిన్ కి సంబంధించి సమర్ధ చర్యలు చేపట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: