ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా అంద‌రూ భ‌య‌బ్రాంతుల‌కు గురై.. ప‌లువురు ప్రాణాలు కోల్పోయిన విష‌యం విధిత‌మే. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేవ్ ప్ర‌భుత్వం క‌రోనా మృతుల ప‌ట్ల  ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కోవిడ్ మృతులకు ప‌రిహారం చెల్లించేందుకు ప్ర‌భుత్వం కీల‌క ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. క‌రోనాతో మ‌ర‌ణించిన వారి కుటుంబానికి రూ.50వేలు మంజూరు చేసేందుకు ఉత్త‌ర్వులు జారీ చేసింది  ఏపీ ప్ర‌భుత్వం.  

కేవ‌లం క‌రోనా కార‌ణంగా  మాత్ర‌మే మృతి చెందిన వారి కుటుంబ స‌భ్యుల‌కు ఈ ప‌రిహారం వ‌ర్తింప‌జేయ‌నుంది. ఇప్ప‌టికే రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసింది. కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సూచనలు చేసింది. . రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలని సూచనలు చేసింది. మృతుల జాబితా రూపొందించి చెల్లింపులు చేయాలని  అధికారుల‌ను సూచించింది. జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వ‌ర్యంలో ప్ర‌తీ ద‌ర‌ఖాస్తుకు ప్ర‌త్యేకంగా నెంబ‌ర్ ఏర్పాటు చేశారు. ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించిన రెండు వారాల‌లోపు ప‌రిహారం చెల్లింపు పూర్తి చేయాల‌ని సూచ‌న‌లు చేసింది. వైద్యారోగ్య‌శాఖ ఈ ద‌ర‌ఖాస్తు కోసం ప్ర‌త్యేక ప్రొఫార్మాను రూపొందించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: