షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్య‌న్‌ఖాన్ కొద్దిరోజులుగా జైల్లో ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ముంబ‌యిలోని ఒక విహార‌నౌక్‌లో రేవ్ పార్టీ జ‌రుపుకుంటూ మాద‌క‌ద్ర‌వ్యాల వినియోగంలో ఆర్య‌న్ ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్ప‌టినుంచి అత‌నికి బెయిల్ కూడా మంజూరు చేయ‌లేదు. దేశంలోని ముఖ్య‌మైన విష‌యాల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించేందుకు ఆర్య‌న్‌ఖాన్ కేసును కేంద్రం వాడుకుంటోందంటూ ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్‌మాలిక్ రంగంలోకి దిగారు. త‌న‌కు ఒక లేఖ వ‌చ్చింద‌ని, బాలీవుడ్ న‌టుల ఫోన్ల‌ను వాంఖ‌డే ట్యాప్ చేస్తున్నారంటూ ఆరోపించారు. అంత‌కుముందు ఆయ‌న త‌న అల్లుడు కూడా తొమ్మిది నెల‌ల క్రితం డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయ్యార‌ని, పేరు లేని ఒక ఎన్‌సీబీ అధికారి పేరుతో త‌న‌కు లేఖ వ‌చ్చింద‌ని, విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే న‌వాబ్ మాలిక్ ఆర్య‌న్‌ఖాన్ కేసుకు సంబంధించి, వాంఖ‌డేకు వ్య‌తిరేకంగా మాట్లాడుతూ రెండురోజుల నుంచి నాట‌కాన్ని ర‌క్తిక‌ట్టిస్తున్నార‌ని, ఆయ‌న ఎందుకు చేస్తున్నార‌నేది అంద‌రికీ తెలిసిన బ‌హిరంగ ర‌హ‌స్య‌మేన‌ని భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: