తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను, రైతుల‌ను బ్లాక్ మెయిల్ చేస్తొంద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు ఎన‌ముల రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రైతుల ధాన్యం సేకరణ బాధ్యత నుంచి చేతులెత్తేసేందుకు ప్రభుత్వం ఎత్తుగడ వేస్తుంద‌ని పేర్కొన్నారు.  వరి పండించే అవకాశం లేనప్పుడు లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల పై వెచ్చించడం దేనికి అని ట్విట్ట‌ర్‌లో  ప్ర‌శ్నించారు  రేవంత్‌రెడ్డి.

అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో విత్త‌నాల షాపుల వారు వ‌రి విత్త‌నం అమ్మితే సుప్రీకోర్టు ఆర్డ‌ర్లు తెచ్చుకున్నా.. వ‌దిలేది లేద‌ని షాపు సీజ్ చేసి తీరుతాన‌ని క‌లెక్ట‌ర్ హెచ్చ‌రించ‌డం ఏంట‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా రేవంత్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీడ్ డీలర్లను సిద్దిపేట కలెక్టర్ బెదిరించడం వరి రైతులను బ్లాక్ మెయిల్ చేయడమేన‌ని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా  ఊరుకోను అంటూ కలెక్టర్ ఒక నియంతలా మాట్లాడుతున్నారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: