కొవిడ్‌ను కట్టడి చేసేందుకు ఉధృతంగా కొనసాగిస్తున్న కరోనా వ్యాక్సినేషన్‌ అమలును వందకు వంద శాతం సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కఠిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ను వేయించుకోని వారికి రేషన్‌, పెన్షన్‌ నిలిపేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ రూల్‌ నవంబర్‌ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డి.హెచ్‌.శ్రీనివాసరావు తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు వేసుకుని.. రెండో డోసు వేసుకోని వారు దాదాపు 35లక్షల మంది వరకు ఉన్నారని అంచనా. డోసు తీసుకోవాల్సిన గడువు తేదీ దాటిపోయినప్పటికీ.. వారు రెండో టీకా వేయించుకోవట్లేదు. ఈ విషయంగా అధికారులు తరుచూ హెచ్చరిస్తూ వస్తున్నప్పటికీ.. రెండో డోసు తీసుకోనివారు, అలాగే అసలే టీకా వేయించుకోవడానికి ఇష్టపడనివారు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ నెలాఖరు వరకు కరోనా వ్యాక్సిన్‌ వేసుకోకుంటే.. రేషన్‌, పెన్షన్‌కు కోత తప్పదని రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: