వ‌రంగ‌ల్ జిల్లా దుగ్గొండి మండ‌లం చాప‌ల‌బండ‌లో 'ఆంత్రాక్స్' వ్యాధి క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు చాప‌ల‌బండ‌లో నాలుగు గొర్రెలు మృతిచెందాయి. అదేవిధంగా వ్యాధి ల‌క్షాణ‌లు ఉన్న గొర్రెల‌ను ఊరికి చివ‌ర‌గా దూరంగా ఉంచాల‌ని య‌జ‌మానుల‌ను అధికారులు ఆదేశించారు.

చాప‌ల‌బండ గ్రామానికి చెందిన గ‌జ్జెల సాంబ‌య్య గొర్రెల మంద‌లో నాలుగు రోజుల నుంచి రోజుకొక గొర్రె చొప్పున మృతి చెందుతున్నాయి. దీంతో సాంబ‌య్య ప‌శువైద్యాధికారుల‌ను సంప్ర‌దించాడు. మృతి చెందిన గొర్రెను ల్యాబ్‌కు పంపాల‌ని అధికారులు సూచించారు. సోమవారం ప‌రీక్ష‌ల కోసం న‌మూనాల‌ను అధికారులు హైద‌రాబాద్ ల్యాబ్ కు పంపారు.  ఈ నేప‌థ్యంలో వెట‌ర్న‌రీ అధికారులు మాట్లాడారు.  వ్యాధి వ్యాప్తి చెంద‌కుండా గొర్రెల‌కు టీకాలు ఇస్తున్నామని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే వ్యాధి నిర్థార‌ణ కోసం ప‌రీక్ష‌ల న‌మూనాల‌ను హైద‌రాబాద్ ల్యాబ్ పంపిన‌ట్టు తెలిపారు. నివేదిక వ‌చ్చిన త‌రువాత వివ‌రాలు తెలుస్తాయ‌ని,  ప్ర‌జ‌లు  ఎలాంటి ఆందోళ‌న చెంద‌వ‌ద్దు అని వెట‌ర్న‌రీ అధికారులు స్ప‌ష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: