తమిళనాడు కళ్లకురిచిలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరో పదకొండు మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. కళ్లకురిచిలోని శంకరాపురంలో బాణసంచా తయారీ కేంద్రంలో ఉన్నట్లుండి పేలుడు సంభవించింది. మంటలు ఒక్కసారిగా ఎగిశాయి. అగ్నికీలల్లో 9 మంది కార్మికులు చిక్కుకుపోయారు. మంటలకు తాళలేక హాహాకారాలు చేశారు. బాణసంచా కేంద్రంలో పేలుడుపై సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తరలివచ్చారు. ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దీపావళి పండుగ కోసం బాణసంచా తయారీ కేంద్రాల్లో కార్మికులకు ఎక్కువగా డిమాండ్‌ ఉంటుంది. ఇదే సమయంలో తరుచు అగ్ని ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటుండటం కార్మికుల కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా జరిగిన మరో ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృత్యువాత పడటంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: