మృతులలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన విష్ణు (25), జగన్నాధ్ (30) లను గుర్తించారు. మృతిచెందిన వారు పీవోపీ విగ్రహ తయారీ కార్మికులుగా పని చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. విగ్రహల తయారీ పరిశ్రమలో బాణసంచా తయారీ కారణంగానే ఈ పేలుడు సంభవించినదని.. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారని పోలీసులు వెల్లడించారు. రసాయనాలు కలవడంతో పేలుడు తీవ్రత ఎక్కువగా అయిందని, పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించినట్టు చెప్పారు. గాయపడిన వ్యక్తి వీరేంద్ర కుమార్‌కు మెరుగైన చికిత్స అందుతుందని పోలీసులు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తును చేపడుతున్నాం అని పోలీసులు వెల్లడించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి