టెలికాం దిగ్గ‌జ సంస్థ అయిన రిల‌య‌న్స్ జియోకు వినియోగ‌దారులు గ‌త సెప్టెంబ‌ర్ నెల‌లో 1.9 కోట్ల వైర్‌లెస్ స‌బ్ స్క్రైబ‌ర్లు త‌గ్గిన‌ట్టు టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్ల‌డించిన‌ది. ముఖ్యంగా సెప్టెంబ‌ర్ నెల‌లో 4.29 శాతం యూజ‌ర్‌బేస్ను కోల్పొయి.. మొబైల్ స‌బ్ స్క్రైబ‌ర్ల సంఖ్య 42.48 కోట్ల‌కు చేరుకుంది. ఇక ఆ నెల‌లో ఎయిర్‌టెల్ నెట్‌వ‌ర్క్‌కు నూతంగా 2.74 ల‌క్ష‌ల మంది యూజ‌ర్లు పెరిగార‌ని ట్రాయ్ పేర్కొంది. ఆగ‌స్టు నెల‌లో 35.41 కోట్ల మంది ఉన్న యూజ‌ర్ల సంఖ్య సెప్టెంబ‌ర్ లో 35.44 కోట్ల‌కు చేరుకున్న‌ది. దీని ఫ‌లితంగా 0.08 శాతం కొత్త యూజ‌ర్‌బేస్‌ను సొంతం చేసుకుంది.

 అయితే మ‌రో టెలికాం సంస్థ వొడాఫోన్, ఐడియా సెప్టెంబ‌ర్ నెల‌లో 10.7 ల‌క్ష‌ల మంది స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను కోల్పోయిన‌ట్టు వివ‌రించింది.  దీంతో యూజ‌ర్ బేస్ 26.99 కోట్ల‌కు త‌గ్గిపోయింది. దేశంలో మొత్తం టెలిఫోన్ స‌బ్ స్క్రైబ‌ర్లు కూడా కాస్త త‌గ్గిన‌ట్టుట్రాయ్ వెల్ల‌డించింది. ఆగ‌స్టులో 118 కోట్ల స‌బ్ స్క్రైబ‌ర్లు ఉంటే సెప్టెంబ‌ర్ చివ‌రికి 116 కోట్ల‌కు త‌గ్గిన‌ట్టు తెలిపింది. తాజాగా ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ధ‌ర‌ల‌ను పెంచుతున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. ప్లాన్‌ల‌పై 20-25 శాతం ధ‌ర‌లు పెంచిన‌ట్టు పేర్కొన్న‌ది. పెంచిన ఛార్జీలు న‌వంబ‌ర్ 26 నుంచి అమ‌లులోకి వ‌స్తాయి అని ప్ర‌క‌టించిన‌ది ఎయిర్ టెల్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: