భార‌త‌దేశంలో బంగారం, వెండిల‌కు ఎప్పుడూ భారీగానే డిమాండ్ ఉంటుంది. ఈ త‌రుణంలోనే బంగారం కొనాల‌ని భావిస్తున్న‌వారికి శుభ‌వార్త అనే చెప్పాలి ఇప్పుడు.  ఇక తాజాగా న‌వంబ‌ర్ 24న బంగారం ధ‌ర స్థిరంగా ఉంటే..వెండి ధ‌ర కూడాఅదేబాట‌లో ప‌య‌నిస్తుంది.  ఢిల్లీలో నిన్న‌ మంగళవారం రాత్రికి రాత్రే 10 గ్రాముల బంగారం ధర రూ.810 తగ్గి రూ.46,896కు చేరుకుంది. కేవలం వారం రోజుల్లోనే పసిడి ధర దాదాపు రూ.2 వేల వరకు తగ్గిన‌ది.

 వెండి ధర కూడా అదే బాటలో  ప‌య‌నిస్తున్న‌ది. కిలో వెండి ధరపై దాదాపు రూ.1600 వరకు తగ్గుముఖం పట్టిన‌ది. ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 64,000, అదేవిధంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై లో64,400 ఉన్న‌ది.  చెన్నైలో కిలో వెండి ధర రూ.79,500 ఉండగా, కోల్‌కతాలో రూ.64,000 కొనసాగుతుంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.69,500 ఉండగా.. విజయవాడలో రూ.69,500 ఉన్న‌ది.  కేరళలో కిలో వెండి ధర రూ.69,500 అయితే మధురైలో రూ.69,500 వద్ద కొన‌సాగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: