హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉన్న‌టువంటి నెహ్రు జూలాజిక‌ల్ పార్కులో ఓ యువ‌కుడు మంగ‌ళ‌వారం హ‌ల్ చ‌ల్ చేసాడు. సింహాలు ఉన్న ఎన్‌క్లోజ‌ర్ లోకి దూకేందుకు ఆయువ‌కుడు ప్ర‌య‌త్నం చేసాడు. సాయికుమార్ అనే యువ‌కుడు ముఖ్యంగా ఆఫ్రిక‌న్ జాతి సింహం ఎన్‌క్లోజ‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి అక్క‌డ ఉన్న బండ‌రాయిపై కూర్చొని ఉన్నాడు. ఈ స‌మ‌యంలోనే సింహం కూడా అత‌ని స‌మీపం వ‌ద్ద‌కు వ‌చ్చింది.

ఏ మాత్రం పొర‌పాటు చేసినా.. అత‌ను రాయిపై నుంచి జారిప‌డిన కానీ సింహం సాయికుమార్ అనే యువ‌కుడిని దాడి చేసి ఉండేది.  ఈ ఘ‌ట‌న‌తో  నెహ్రు జూ పార్కు సంద‌ర్శ‌కులు కాస్త ఆందోళ‌న‌కు గుర‌య్యారు. అక్క‌డి నుంచి వెంట‌నే బ‌య‌టికి రావాల‌ని సంద‌ర్శ‌కులు ఎంత చెప్పినా ఆ యువ‌కుడు ప‌ట్టించుకోలేదు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన జూపార్కు సిబ్బంది ఆ యువ‌కుడిని బ‌య‌టికి తీసుకొచ్చి కాపాడారు. ఇలా ప్ర‌వ‌ర్తించిన సాయికుమార్‌ను బ‌హ‌దూర్‌పురా పోలీసుల‌కు అప్ప‌గించారు. అయితే పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టిన త‌రువాత ఆ యువ‌కునికి మ‌తిస్థిమితం స‌రిగ్గా లేక‌నే  జూపార్కులో ఈ విధంగా  ప్ర‌వ‌ర్తించాడ‌ని తేల్చారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: