దేశ‌వ్యాప్తంగా వ‌రుస‌గా భూకంపాలు క‌ల‌వ‌ర‌పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు హిమాల‌య రీజియ‌న్ రాష్ట్రాల‌తో పాటు అండ‌మాన్ నికోబార్ దీవుల్లో కూడా భూకంపాలు త‌రుచుగా సంభ‌విస్తూనే ఉన్నాయి. అయితే రిక్ట‌ర్ స్కెల్ పై మాత్రం భూకంప తీవ్ర‌త కాస్త త‌క్కువ‌గా ఉండ‌డంతో పెద్ద‌గా ఆస్తి, ప్రాణ న‌ష్టాలు లేక‌పోవ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌యం. భూకంప తీవ్రత కార‌ణంగా జ‌నాల్లో భ‌యాందోళ‌నలు నెల‌కొన్నాయి. మిజోరాం, అస్సాం వంటి రాష్ట్రాల‌లో ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా భూకంపాలు న‌మోదు అవుతున్నాయి.

తాజాగా అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం ఉదయం అక‌స్మాత్తుగా భూకంపం సంభవించిన‌ది. కాంప్ బెల్ బే కు ఈశాన్య దిశగా ఈ భూకంపం సంభ‌వించిన‌ట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర కేంద్రీకృత‌మైంద‌ని తెలిపింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4 గా న‌మోదు అయిన‌ది. ఈ  భూకంపం ధాటికి స్థానికంగా ఉన్న భూమి ప్రకంపనలకు గుర‌వ్వ‌డంతో ఒక్క‌సారిగా జ‌నాలు ఉల‌క్కిప‌డ్డ‌ట్టు అయ్యారు

మరింత సమాచారం తెలుసుకోండి: