ఎల్‌పీజీ ధరలు విపరీతంగా పెరిగడంతో కొన్ని చోట్ల దాదాపు రూ. 1000 మార్కును తాకింది గ్యాస్ ధ‌ర‌. కొన్ని చోట్ల అయితే ఏకైక రూ.1100 నుంచి 1200 వ‌ర‌కు కూడా అమ్ముతున్నారు ప‌ల్లెటూర్ల‌లో. గ్యాస్ ధ‌ర పెర‌గ‌డం సామాన్యుడిపై ఇది పెను భారమే అని చెప్పొచ్చు.  కొంతకాలం క్రితం వరకు రూ. 594కి లభించే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్‌ రూ. 834కు కొన్ని చోట్ల రూ. 1000 వరకు పెరిగిన‌ది. గతంలో సబ్సిడీగా వచ్చే డబ్బులను అమాంతం ఒక్క‌సారిగా తగ్గించి రూ.20, రూ.30 మాత్రమే ఇస్తున్నారు.

అయితే రూ.300వరకూ సబ్సిడీ పొందాలనుకుంటే మాత్రం ఇలా చేయండి. తమ స‌బ్సీడి ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్ ధ‌ర‌ల పెంపు వ‌ల్ల సామాన్య ప్ర‌జ‌లపై ఒత్తిడి పెంచుతున్న త‌రుణంలో ప్ర‌భుత్వం స‌బ్సీడి రూపంలో ఇచ్చే మిన‌హాయింపుల‌ను పెంచాల‌ని నిర్ణ‌యించిన‌ది. స‌బ్సీడి ద్వారా గ‌రిష్ట ప్ర‌యోజ‌నం చేకూర‌నుంది. అయితే గతంలో రూ.174.86 సబ్సిడీ పొందుతుండగా ఇప్పుడు రూ.312.48 వ‌ర‌కు పెంచారు. ఆధార్‌తో లింక్ చేయాలంటే మాత్రం ఇండియ‌న్ ఎల్‌పీజీ  గ్యాస్ సిలిండర్ కస్టమర్ల కోసం cx.indianoil.in వెబ్‌సైట్ సంద‌ర్శించాలి. ఇక‌ మీరే మీ ఆధార్ కార్డును సబ్సిడీ బ్యాంక్ ఖాతాతో నేరుగా లింక్ చేసుకోవ‌చ్చు.మరింత సమాచారం తెలుసుకోండి: