టాలీవుడ్ లెజెండ‌రీ నటుడు కైకాల సత్యనారాయణ అస్వస్థతకు గురైన విష‌యం విధిత‌మే. అయితే  ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు కైకాల సత్యనారాయణ.  అనారోగ్య కారణాలతో అపోలో ఆసుప‌త్రిలో చేరినప్ప‌టి నుంచి మెగాస్టార్ చిరంజీవి అపోలో హాస్పిటల్ డాక్ట‌ర్‌లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రతిరోజూ రెండు పూటలా ఆయన ఆరోగ్య పరిస్థితి ఏవిధంగా ఉంది? ఆయన స్పృహలో ఉన్నారా?  లేదా? ఇంకా ఎలాంటి  ట్రీట్‌మెంట్ ఇస్తే ఆయన మరింత త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంద‌నే అవకాశాల గురించి డాక్టర్ లతో సంప్రదింపులు చేప‌డుతున్నారు.

కైకాల సత్యనారాయణ స్పృహలోకి వచ్చారని తాను మాట్లాడిన తర్వాత థమ్సప్ చూపించారని కూడా ముందుగా చిరంజీవి వెల్లడించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ విషయంలో కైకాల సత్యనారాయణ కుటుంబానికి అన్ని తానే అపోలో హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడుతూ కైకాల కుటుంబ సభ్యులకు చిరంజీవి చాలా  ధైర్యం చెబుతున్నారు. అదేవిధంగా టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కూడా ఎప్పటికప్పుడు కైకాల ఆరోగ్యం గురించి  తెలుసుకుంటున్నారు. ఇలాంటి కష్ట సమయంలో తమకు ఇంతలా ఒక అండగా నిలబడిన  చిరంజీవికి కైకాల కుటుంబ సభ్యులు ఋణపడి ఉంటామ‌ని పేర్కొంటున్నారు. చిరంజీవితో పాటు టాలీవుడ్ సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు,  యంగ్ హీరో య‌ష్‌, శివ‌రాజ్‌కుమార్ లు కూడా ఫోన్ చేసి కైకాల ఆరోగ్యం గురించి ఆరా తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: