చిత్తూరు జిల్లా రాయ‌ల‌చెరువును ప‌రిశీలించిన చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడారు. మా ప్ర‌భుత్వం వ‌చ్చాక వ‌ర్షాల వ‌ల్ల న‌ష్ట‌పోయిన  బాధితుల‌కు రూ. 25 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ఇస్తుంద‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. క‌ష్టాల్లో ఉండే ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండ‌డం ప్ర‌భుత్వం బాధ్య‌త.  ఈ ప్ర‌భుత్వం అది చేప‌ట్ట‌డం లేద‌ని, ఇబ్బందుల‌ను అధిగ‌మించ‌డానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉండాలి. నేను ప్ర‌జ‌లకు అండ‌గా ఉండ‌డానికి ఇక్క‌డికి వ‌చ్చాన‌ని, రాజ‌కీయం కోసం రాలేద‌ని, మీ త‌రుపున పోరాడుతాన‌ని స్ప‌స్టం చేశారు మాజీ సీఎం చంద్ర‌బాబు.

స్వ‌ర్ణ‌ముఖీ న‌ది వ‌ల్ల బ్రిడ్జిలు కాజ్‌వేలు అన్ని కొట్టుకుపోయాయ‌ని వెల్ల‌డించారు. ఇక్క‌డ ఉన్న నేత‌లు చెరువుల‌ను క‌బ్జాలు చేసార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు చంద్ర‌బాబు.  మ‌రోవైపు తొలుత టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలీసులు కొద్ది సేప‌టివ‌ర‌కు అనుమతి ఇవ్వలేదు. రాయలచెరువును రెడ్‌జోన్‌గా గుర్తించామని, గండి పడటంతో మరమ్మతు పనులు జరుగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. రాయలచెరువు వద్ద మరమ్మతుల పనులు చేప‌డుతుండ‌డంతో చంద్రబాబు కాన్వాయ్ వెళ్లేందుకు ఇబ్బంది ఎదురవుతుందని పోలీసులు వివ‌రించారు. ఈ త‌రుణంలోనే చంద్రబాబుకు తాము భద్రత కల్పించలేమని, అందుకే అనుమ‌తి నిరాకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. చంద్రబాబుకు అనుమతి ఇవ్వకపోవడంతో టీడీపీ కార్యకర్తలు కాస్త ఘర్షణకు దిగారు.  చంద్రబాబు రాయలచెరువు పర్యటన కాస్త ఉద్రిక్తంగా మారింది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: