వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తూ వెన‌క్కి తీసుకుంటున్నామ‌ని ఈనెల 19న గురునాన‌క్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ  ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం విధిత‌మే. అయితే ఈ చ‌ట్టాల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం మ‌రొక కీలక అడుగు వేసింది. వివాద‌స్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకునే ప్ర‌క్రియ‌కు తాజాగా కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర‌ను వేసింది. వివాద‌స్ప‌ద 3 వ్యవ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కు తీసుకునే ప్ర‌క్రియ‌ను కేంద్రం పూర్తి చేసింది. రానున్న పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశంలో ఉప‌సంహ‌ర‌న‌కు స‌ర్వం సిద్ధం అయింది.

అదేవిధంగా  మరో 4 నెలల పాటు ఉచిత రేషన్ పథకాన్ని కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్  కీల‌క నిర్ణయం తీసుకుంది. మార్చి 2022 వరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కొనసాగించాలని ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై రూ. 53,344.52 కోట్ల ఆర్థిక భారం పడనున్న‌ది. ఈ విడతలో 163 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలను కేంద్రం  విడుదల చేయనుంది. దీనిద్వారా ప్రతివ్యక్తికీ ప్రతి నెల 5 కేజీల ఆహారధాన్యాలు  కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించ‌నున్న‌ది.


మరింత సమాచారం తెలుసుకోండి: