ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తలు రౌడీల తరహాలో రెచ్చిపోయార‌ని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. టీడీపీ కార్యకర్త సైదాను అత్యంత దారుణంగా కొట్టారని లోకేష్‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేసారు. ఓ వ్యక్తిని రోడ్డు డివైడర్‌పై పడేసి కొందరు తీవ్రంగా కొట్టడం ఆ వీడియోలో కనిపిస్తున్న‌ది.   అరాచకాలలో ఆంధ్రప్రదేశ్ అఫ్ఘనిస్థాన్‌ను మించిపోయిందని లోకేష్  ఆవేశంతో వ్యాఖ్య‌లు చేసారు.

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన సైదా అనే వ్యక్తి టీడీపీ ఏజెంట్‌గా ప‌ని చేసాడు. ఏజెంట్‌గా ప‌ని చేసాడ‌నే కక్ష్యతో వైసీపీ నేతలు నరరూప రాక్షసుల్లా మారి దారుణంగా కొట్టారని లోకేష్ ఆరోపించారు. ఈ దాడి ఘటన చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో  ఇట్టే అర్థమవుతోందని లోకేష్ మండిపడ్డారు. పొలం తగాదా నెపంతో వైసీపీ నేతలు ఈ దాడికి పాల్పడ్డారని,  రాష్ట్రంలో వైసీపీ ఫ్యాక్షన్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్ల‌డించారు. ఓవైపు పోలీసులు నిద్రపోతుంటే… వైసీపీ ఫ్యాక్షన్ మూకలు పట్టపగలు ఇలా బరితెగిస్తున్నాయని లోకేష్ ఘాటుగా విమర్శ‌లు చేసారు. అయితే  వైసీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడ్డ సైదా ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: