త‌మిళ‌నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎడ‌తెరిపిలేకుండా గ‌త రెండు రోజుల నుంచి కురుస్తూనే ఉన్నాయి. ఇప్ప‌టికీ రోడ్ల‌న్ని, లోత‌ట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ప‌లు జిల్లాల‌కు తూత్తుకుడి, తెన్‌కాశీ, చెంగ‌ల్‌ప‌ట్టు, తిరున‌ల్వేలి జిల్లాల‌కు ఐఎండీ రెడ్ అలెర్ట్ ప్ర‌క‌టించిన‌ది. ముఖ్యంగా చెన్నై న‌గ‌రంలో వ‌ర్షం బీభ‌త్సం సృష్టిస్తున్న‌ది. గ‌త ప‌ది రోజుల కింద‌టే న‌గ‌రాన్ని అత‌ల‌కుతలం చేసిన భారీ వ‌ర్షం ప్ర‌జ‌లు తేరుకునే లోపు మ‌ళ్లీ రావ‌డంతో ప్ర‌జ‌ల‌కు ఏమి చేయాలో పాలు పోవ‌డం లేదు.

ముఖ్యంగా నాలుగు జిల్లాలోని పాఠ‌శాల‌ల‌కు, క‌ళాశాల‌ల‌కు ఇప్ప‌టికే ప్ర‌భుత్వం సెల‌వుల‌ను ప్ర‌క‌టించిన‌ది. ఇక ఆయా జిల్లాల ప్ర‌జ‌లు కూడా వారానికి స‌రిప‌డే నిత్య‌వ‌స‌రాల‌ను ఇండ్ల‌లో ఉంచుకోవాల‌ని అధికారులు సూచించారు. ఇవాళ  గురువారం ఒక్క‌రోజే 33 మిల్లీలీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదు అయింద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో తూత్తుకుడి ఎయిర్‌ఫోర్ట్‌లో విమానాల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ఇప్ప‌టికే ప‌లు విమానాల‌ను అధికారులు దారి మ‌ళ్లిస్తూ ఉన్నారు.  అదేవిధంగా చెన్నై న‌గ‌ర స‌మీపంలోని జిల్లాల‌కు కూడా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: