ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన  వ‌రిధాన్యం లారీలలో తీసుకొని   తెలంగాణ శివారు  జిల్లా అయిన గద్వాల్  మీదుగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్ర‌వేశించ‌డానికి ప్ర‌య‌త్నం చేసారు. అయితే వ‌రి ధాన్యం లారీ ల‌ను తెలంగాణ అధికారులు  గుర్తించి అడ్డుకున్నారు. గ‌త కొద్ది రోజుల నుండి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో వ‌రి ధాన్యం త‌డిసి ముద్ద‌యిపోయింది.  దీంతో ఆంధ్ర ప్ర‌దేశ్ లో ప్ర‌భుత్వం వ‌రి ధాన్యం కొనుగోలు కేంద్రాల వ‌ద్ద చాలా ఆల‌స్యం జ‌రుగుతుంది. లారీల‌లో వ‌రి ధాన్యాన్ని తెలంగాణ కు తీసుకువ‌చ్చి అమ్మాలని ప్ర‌య‌త్నించారు.

ఇది గ‌మ‌నించిన   తెలంగాణ అధికారులు  లారీలను నిలిపి వేశారు.  ప్ర‌స్తుతం తెలంగాణ లో కూడా వ‌రి ధాన్యం కొనుగోలు కేంద్రాల వ‌ద్ద  తీవ్ర జాప్యం జ‌రుగుతున్న విష‌యం విధిత‌మే. తెలంగాణ లో కూడా ఇటీవ‌ల వ‌ర్షాలు ప‌డ‌టంతో వ‌రి ధాన్యం త‌డిసి ముద్ద‌యింది. కొంత మంది రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వ‌ద్ద‌నే ఎదురు చూడ‌లేక కుప్ప‌కూలిపోతున్నారు. ఇటీవ‌ల గ‌ద్వాల జిల్లాలో ఓ రైతు ధాన్యం ఆర‌బెడుతూ గుండె పోటుతో మ‌ర‌ణించాడు. కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రం వ‌ద్ద జాప్యం జ‌ర‌గ‌డంతో గురువారం సాయంత్రం గుండె ఆగిపోయింది. తెలంగాణ కు చెందిన వ‌రి ధాన్యం కొనుగోలు చేయ‌డ మే సాధ్య ప‌డ‌డం లేద‌ని,  ఇలాంటి సంద‌ర్భంలో ఏపీ నుంచి వ‌చ్చిన వ‌రి ధాన్యాన్ని ఎలా కొనుగోలు చేస్తార‌ని తెలంగాణ‌ రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: