రోజు రోజుకు టెక్నాల‌జి అభివృద్ధి చెందుతున్నా కానీ కొంత మంది మాత్రం ఇంకా మూఢ‌న‌మ్మ‌కాల నుంచి మాత్రం బ‌య‌ట‌ప‌డ‌డం లేద‌నే చెప్పుకోవ‌చ్చు. ఏ మారుమూల గ్రామంలో నైతే ఏమో లే అనుకుంటాం. కానీ తెలంగాణ రాజ‌ధాని అయిన‌టువంటి హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో కూడా ఇలాంటి మూఢ‌న‌మ్మ‌కాల‌ను ఎంత బాగా న‌మ్ముతున్నారో ఇట్టే అర్థం అవుతుంది. ఈ న‌మ్మ‌కాన్ని వ‌మ్ముచేసుకుని క్యాష్ చేసుకుని కొంత‌మంది దొంగ‌బాబాలు దారుణాల‌కు పాల్ప‌డుతూనే ఉన్నారు.

హైద‌రాబాద్‌లో ఓ దొంగ‌బాబా మంత్రాల నెపంతో ఇద్ద‌రు యువ‌తుల‌పై  క‌న్నెసి అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు. వివరాళ్లోకి వెళ్లితే.. హైద‌రాబాద్‌లోని పాత‌బస్తీలో నివాసం ఉండే  ఓ కుటుంబంలోని త‌ల్లి అనారోగ్యానికి గురైంది. త‌న త‌ల్లి అనారోగ్యానికి గురైంద‌ని.. త‌ల్లిని కాపాడుకునేందుకు ఓ బాబా వ‌ద్ద‌కు తీసుకెళ్లితే ఆరోగ్యం న‌యం అవుతుంద‌ని చెప్ప‌డంతో.. ఇద్ద‌రూ అక్క‌చెల్లెల్లు క‌లిసి  ఆ బాబాను ఆశ్ర‌యించారు. త‌ల్లి ఆరోగ్యాన్ని ప‌క్క‌కు పెట్టిన బాబా ఆ యువ‌తుల‌పై క‌న్నేసాడు. మీ త‌ల్లికి మంత్రాలు చేసార‌ని, అది మీ మీద కూడా ప‌డే ప్ర‌భావం ఉంద‌ని న‌మ్మ‌బ‌లికించి ప‌లుమార్లు అత్యాచారం చేశాడు. విచిత్ర‌మేమిటంటే ఇద్ద‌రు కుమార్తెల‌లో ఓ వివాహిత‌పై బాబా కుమారుడు కూడా అత్యాచారం చేయ‌డం గ‌మనార్హం. ఇద్ద‌రు యువ‌తుల‌ను శారీర‌కంగా, మాన‌సికంగా వాడుకోవ‌డంతో పాటు ఆర్థికంగా కూడా దొంగ‌బాబా వారిని కుంగ‌దీసాడు. ఆ బాధిత మ‌హిళ‌లు చేసేది ఏమి లేక మోసపోయామ‌ని ఆల‌స్యంగా తెలుసుకుని పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో బాబాను, అత‌ని కుమారుడిని అరెస్టు చేశారు పోలీసులు.


మరింత సమాచారం తెలుసుకోండి: