ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సినిమా థియేట‌ర్లలో టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచాల‌ని మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్వీట్ చేసాడు. ఏపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జీవో నెంబ‌ర్ 35లో కొన్ని మార్పులు చేయాల‌ని సూచించారు. టికెట్ల రేట్ల పెంపు అంశం ప‌రిశీలించి నిర్ణ‌యింస్తామ‌ని, ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది లేకుండా టికెట్ల ధ‌ర‌లు పెంపుపై సీఎం జ‌గ‌న్‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని మంత్రి పేర్నినాని చెప్పారు.

మ‌రోవైపు నిన్న ప‌రిశ్ర‌మ కోరిన విధంగా పార‌ద‌ర్శ‌క‌త కోసం ఆన్‌లైన్ టికెటింగ్ బిల్లు ప్ర‌వేశ‌పెట్ట‌డం హ‌ర్శించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని చిరంజీవి పేర్కొన్న విష‌యం విధిత‌మే. అదేవిధంగా థియేట‌ర్ల మ‌నుగ‌డ కోసం సినిమాను ఆధారంగా చేసుకుని వేల కుటుంబాలు బ‌తుకుతున్నాయ‌ని... టికెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డం మూలంగా స‌ముచితంగా దేశంలోని అన్నీ రాష్ట్రాల‌లో ఉన్న విధంగా నిర్ణ‌యిస్తే చిత్ర ప‌రిశ్ర‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని చిరంజీవి పేర్కొన్నారు. దేశం అంత‌టా ఒకే జీఎస్‌టీ, ఒకే ట్యాక్స్‌గా ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న‌ప్పుడూ టికెట్ ధ‌ర‌ల్లో కూడా అదే వెల‌సుబాటు ఉండ‌డం స‌మంజ‌స‌మ‌ని భావిస్తున్న‌ట్టు త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసాడు చిరు.

మరింత సమాచారం తెలుసుకోండి: