ర‌ష్యాలోని సైబీరియాలో ఉన్న బొగ్గుగ‌నిలో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. దాదాపు 52 మంది మృతి చెంద‌గా.. అధిక సంఖ్య‌లో గాయ‌ల‌పాల‌య్యారు. ర‌ష్యాలోని సైబీరియాలో ఈ పెను ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ది. కెమెరెవో ప్రాంతంలో సంభ‌వించిన అగ్నిప్ర‌మాదంలో  ఒక్క‌సారిగా 52 మంది మృత్యువాత‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు సెక్యూరిటీ అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

దాదాపు గ‌త ఐదేండ్ల కాలంలో అత్యంత ఘోర‌మైన ఘ‌ని ప్ర‌మాదంగా ర‌ష్య‌న్ అధికారులు భావిస్తున్నారు. లిస్ట్‌వ్యాంకా ప్రాంతంలో ఉన్న గ‌నిలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన వారిని కూడా ర‌క్షించే అవ‌కాశం లేకుండా పోయింద‌ని ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో వెల్ల‌డి అయింది. బొగ్గు పొగ కార‌ణంగా వెంటిలేష‌న్ స‌మ‌స్య‌తో 11 మంది మైన‌ర్లు మ‌ర‌ణించిన‌ట్టు మొద‌ట వార్త వినిపించింది.  250 మీట‌ర్ల లోతులో ఉండడంతో గ‌ని రెస్క్యూ టీమ్ వారిని గుర్తించ‌డం క‌ష్టంగా మారిన‌ది. ఎట్ట‌కేల‌కు మాత్రం కొంద‌రినీ రెస్క్యూ టీమ్ గుర్తించి ర‌క్షించారు. దాదాపు 40 మంది వ‌ర‌కు ఆసుప‌త్రిలో చేర్చార‌ని.. అందులో న‌లుగురి ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉంద‌ని తెలుస్తుంది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో దాదాపు 285 మంది కార్మికులు భూగ‌ర్భంలో ఉన్న గ‌నిలో పని చేస్తున్నారు. దాదాపుగా ఎక్కువ మందిని ముందుగానే గ‌నిలోంచి బ‌య‌ట‌కు తీసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: