ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త కొద్ది రోజుల నుంచి శాస‌న స‌భ స‌మావేశాలు జ‌రుగుతున్న విష‌యం విధిత‌మే. అయితే తాజాగా ఏపీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలోకి శాస‌న‌స‌భ స‌భ్యులు ఎవ‌రూ కూడా మొబైల్ ఫోన్‌ల‌ను తీసుకురావ‌ద్ద‌ని ఆదేశించారు స్పీక‌ర్‌. ఇటీవ‌ల కాలంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల దృష్ట్యా శాస‌న‌స‌భ‌లో సెల్‌ఫోన్‌ల వినియోగం వ‌ద్ద‌ని స‌భ్యులకు సూచించారు.

ఇందుకు శాస‌న స‌భ్యులు కూడా స‌మ్మ‌తి తెలిపిన‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఇవాళ‌ జకియా ఖాన్‌ బాధ్యతలు చేపట్టారు. ఈ మేర‌కు ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆమెను స్వ‌యంగా కుర్చీ వద్ద‌కు తీసుకెళ్లడంతో ఆమె సీఎంకు ధ‌న్యావాదాలు చెప్పారు. గౌరవప్రదమైన స్థానానికి తనను అర్హురాలుగా చెప్పి మంచి ఉద్దేశంతో ఈ పదవీ ఇచ్చినందుకు సీఎం జగన్‌కు రుణపడి ఉంటానని పేర్కొన్నారు జ‌కియాఖాన్‌.  మహిళల సంక్షేమ కోసం అనేక‌ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్‌ మహిళా పక్షపతి అని నిరూపించుకున్నారని,  దేశానికే ఏపీ ఆదర్శంగా ఉందని వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: