భారత్-మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం బలమైన భూ కంపం సంభవించింది. దీని తీవ్రత 6.1 గా నమోదైంది. బలమైన భూ కంపం కారణంగా సంభవించిన నష్టం  ఎంత మేరకు ఉంటుందనే విషయమై తక్షణ నివేదికలు  ఇంకా అందుబాటులోనికి రాలేదు.
భారత్ కు చెందిన  నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ సంస్థ పేర్కోన్న వివరాల ప్రకారం, భూకంపం 12 కి.మీ లోతులో ఉంది . ఈశాన్య భారతదేశంలోని ఐజ్వాల్‌కు 140 కి.మీ దూరంలో ఈ భు కంపం సంభవించింది.
 ఈ ప్రాంతం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌కు ,ఐజ్వాల్‌కు దాదాపు 280 మైళ్ల (450.62 కిమీ) దూరంలో ఉంది.   ఈ భూ కంపం  భారత్ లో తూర్పున ఉన్న నగరం కోల్‌కతా వరకు కనిపించిందని, యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్  (ఇఎం.ఎస్.సి)  తన వెబ్ సైట్ లో పేర్కోనింది.
"చాలా బలంగా ఉంది," అని చిట్టగాంగ్ కు చెందిన ఓ  ప్రత్యక్ష సాక్షి ఇఎం.ఎస్.సి కి తెలిపారు.  భూమి కంపించిన ప్రాంతం,  భూకంప కేంద్రానికి పశ్చిమాన 184 కిమీ   దూరంలో ఉంది.
ఇఎం.ఎస్.సి తో పాటు,  భారతదేశ భూకంప పర్యవేక్షణ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం..., ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రాలు, బంగ్లాదేశ్‌లోని ప్రధాన నగరాల్లో శుక్రవారం భూ ప్రకంపనలు సంభవించాయి. అయితే ఇఎం.ఎస్.సి భూ కంప తీవ్రతను 6.0 గా తొలుత పేర్కోంది. ఆ తరువాత తీవ్రతం 5.8 గా ఉన్నట్లు  తెలపడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: