తెలంగాణ ప్ర‌భుత్వం ధ‌ర‌ణి పోర్ట‌ల్ వెబ్‌సైట్‌ను భారీ మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధం అయింది.  నిషేధిత భూముల తొల‌గింపు, కొత్త మాడ్యుల్స్‌తో స‌మ‌స్య‌ల ప‌రిష్కారం చేయ‌వ‌చ్చ‌ని భావిస్తుంది. వ్య‌వ‌సాయ భూముల‌లో ఎవ‌రైనా ఇండ్ల‌ను నిర్మించుకున్న‌ట్ట‌యితే రైతుబంధు అమ‌లు నిలిపివేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ధ‌ర‌ణి పోర్టల్ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత నిషేధిత జాబితాలోకి ల‌క్ష‌ల ఎక‌రాల భూములు వెళ్లాయి.

ధ‌ర‌ణిలో రిజిస్ట్రేష‌న్‌ల‌ను ర‌ద్దు చేసుకున్నా డ‌బ్బులు చెల్లించేలా ప్ర‌భుత్వం ఏర్పాట్ల‌ను సిద్ధం చేస్తున్న‌ది. ఇప్ప‌టికే వేలాది మంది రైతులు క‌లెక్ట‌రేట్ కార్యాల‌యాల చుట్టు చెప్పులు అరిగేలా తిరుగుతున్నార‌ని, ప‌లు  మీడియాల్లో క‌థ‌నాలు, సోష‌ల్ మీడియాలో పోస్టులు వైర‌ల్ అవుతున్న విష‌యం విధిత‌మే. తాజాగా కొంత మంది రైతులు కూడా ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిన‌దే. ఈ త‌రుణంలోనే రైతుల విన్న‌పాల‌ను సుమోటోగా తీసుకుని స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని ప్ర‌భుత్వం క‌లెక్ట‌ర్‌ల‌కు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లోనే ధ‌ర‌ణి నిషేధిత జాబితా నుంచి భూముల‌ను తొల‌గించ‌నున్న‌ట్టు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: