గ‌త కొంత కాలం నుంచి కాస్త రైల్వే ప్ర‌మాదాలు త‌గ్గాయ‌నుకున్న త‌రుణంలోనే తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్ర‌మాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా  ఇవాళ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో పెను ప్ర‌మాదం త‌ప్పింద‌నే చెప్పుకోవ‌చ్చు.ఉదంపూర్‌-దుర్గ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఏ1, ఏ2 బోగీల‌లో ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో  ఉదంపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో రెండు బోగీలు పూర్తి దగ్దం అయ్యాయి.

అదేవిధంగా మ‌రో మూడు బోగీల‌కు కూడా మంట‌లు వ్యాపించ‌డంతో రైల్వే అధికారులు అప్ర‌మ‌త్తం అయి ఆ బోగీల‌ను వేరు చేసారు. వెంట‌నే ప్ర‌యాణికుల‌ను రైలు నుంచి కిందికి దించి సుర‌క్షితంగా కాపాడారు. దీంతో ప్రాణాపాయం త‌ప్పిన‌ది. హేతంపూర్ స్టేష‌న్ నుంచి వెళ్లిన కొద్ది సేప‌టికే ఈ ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని స‌మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు. రైల్వే ప్ర‌మాదం దృష్ట్యా ఆ రూట్‌లో కొద్ది సేప‌టి వ‌ర‌కు  రైళ్ల రాక‌పోక‌ల‌ను నిలిపివేసారు అధికారులు.  


మరింత సమాచారం తెలుసుకోండి: