టాలీవుడ్‌లో మ‌రొక విషాదం చోటు చేసుకున్న‌ది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కే.ఎస్‌. నాగేశ్వ‌ర‌రావు అక‌స్మాత్తుగా మృతి చెందారు. న‌వంబ‌ర్ 26న శుక్ర‌వారం ఆయ‌న ఊరు నుంచి హైద‌రాబాద్‌కు తిరిగి వ‌స్తుండ‌గా మార్గ మ‌ధ్య‌లో కోదాడ వ‌ద్ద అక‌స్మాత్తుగా పిట్స్ వ‌చ్చింది.  అక‌స్మాత్తుగా పిట్స్ రావ‌డంతో ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ మ‌ధ్య‌లోనే మ‌ర‌ణించాడు.

ద‌ర్శ‌కుడు నాగేశ్వ‌ర‌రావు మ‌ర‌ణంతో సినీ ప్ర‌ముఖులు ప‌లువురు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అక‌స్మాత్తుగా ఆయ‌న మ‌ర‌ణించ‌డం సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు అని ప్రముఖులు పేర్కొంటున్నారు.   నాగేశ్వ‌ర‌రావు మ‌ర‌ణంతో సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలుపుతున్నారు. ద‌ర్శ‌కుని భౌతిక కాయాన్ని ప్ర‌స్తుతం వారి అత్త‌గారి ఊరు అయిన న‌ల్ల‌జెర్ల ద‌గ్గ‌ర‌లోని కౌలూరు గ్రామంలో ఉంచారు. అక్క‌డే నాగేశ్వ‌ర‌రావు అంత్య‌క్రియ‌లు జ‌రుగ‌నున్న‌ట్టు స‌మాచారం.

 టాలీవుడ్‌లోకి తొలిచిత్రం అయిన  'రిక్షా రుద్రయ్యస‌తో ఆయ‌న‌ అడుగుపెట్టారు.  ఆ త‌రువాత  రియల్‌ స్టార్‌ శ్రీహరిని 'పోలీస్‌' సినిమాతో హీరోగా పరిచయం చేసారు. ఆ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకోవ‌డంతోసాంబయ్య, శ్రైశైలం, దేశద్రోహి, శివన్న, వైజయంతి వంటి చిత్రాలను తెర‌కెక్కించారు నాగేశ్వరరావు.  ఇక ఈ ద‌ర్శ‌కుడికి  భార్యతో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: