హైద‌రాబాద్‌- విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిపై  త‌రుచూ ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంటుంది. ఇవాళ  న‌ల్ల‌గొండ జిల్లా చిట్యాల మండ‌లం గుండ్రాంప‌ల్లి స‌మీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై డివైడ‌ర్‌ను ఓ లారీ ఢీ కొట్టి రోడ్డుకు అడ్డం ప‌డ‌డంతో ట్రాఫిక్ ర‌ద్దీ ఏర్ప‌డిన‌ది. సుమారు 4 కిలోమీట‌ర్ల మేర‌కు వాహ‌నాలు నిలిచిపోయాయి.

ఇప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు లారీని రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమైపోయారు. మామూలుగా హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిపై పండుగ‌ల సంద‌ర్భంలో ట్రాఫిక్ జామ్ ఎక్కువ‌గా క‌న‌పడుతుంటుంది. ముఖ్యంగా ద‌స‌రా, సంక్రాంతి పండుగ‌ల వేళ‌లో న‌గ‌ర‌వాసులు త‌మ సొంతూళ్ల‌కు ప‌య‌న‌మ‌వుతుండ‌డంతో ట్రాఫిక్ స‌మ‌స్య త‌లెత్త‌డం చూస్తుంటాం.

అక్టోబ‌ర్ నెల‌లో ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా చౌటుప్ప‌ల్ నుంచి కొయ్య‌ల‌గూడెం వ‌ర‌కు దాదాపు 4 కీమీ పైగా వాహ‌నాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంత‌రాయం క‌లిగించాయి. ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేసేందుకు కొన్ని గంట‌ల పాటు పోలీసులు శ్ర‌మించారు. అయినా అప్పుడు గంట‌ల కొద్ది వాహ‌నదారులు ట్రాఫిక్‌లోనే చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: