టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను చెప్పుల‌తో కొట్టండి అని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయ‌కుండా రైతుల‌ను గోస పెడుతున్నార‌ని, సీఎం కేసీఆర్‌ను అడ్డుకోండి అని ప్ర‌జ‌ల‌కు పిలుపును ఇచ్చారు వెంకట్‌రెడ్డి. తాను ఎవ‌రితోనైనా ప‌ని చేస్తాన‌ని.. కాంగ్రెస్ అంటే కేవ‌లం కోమ‌టిరెడ్డి, ఉత్త‌మ్‌, రేవంత్ లు కాద‌ని పేర్కొన్నారు.

కార్య‌క‌ర్త‌ల మూలంగానే మేము నాయ‌కులం అయ్యాం అని, నేను అడిగింది పీసీసీ ప‌ద‌వీ అని గుర్తు చేసారు కోమ‌టిరెడ్డి. ఇప్పుడు కూడా పార్టీ కోసం ప‌ని చేస్తాన‌ని, ప‌దవులు ఎవ‌రైనా తీసుకొని.. కానీ ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపిస్తాను అని స్ప‌ష్టం చేసారు. మిగిలిన నాయ‌కులు కూడా త‌లా 10 మందిని గెలిపిస్తే చాలు కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేసారు. తెలంగాణ నెల‌కొన్న రైతుల స‌మ‌స్య‌పై తన‌తో పాటు రేవంత్‌రెడ్డి, ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిలు పార్ల‌మెంట్‌లో లేవ‌నెత్త‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. పార్ల‌మెంట్‌లో రైతుల స‌మ‌స్య‌పై సోనియాగాంధీతో మాట్లాడిస్తామ‌ని చెప్పారు కోమ‌టిరెడ్డి. ఢిల్లీలో ధాన్యం కొనుగోలు పై ఆందోళ‌న కొన‌సాగిస్తాం అని.. ప్రియాంక‌గాంధీని కూడా పిలుస్తామ‌ని స్ప‌ష్టం చేసారు కోమ‌టిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: