హైద‌రాబాద్ మియాపూర్‌లో ఓ యువ సాప్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యమైన ఘ‌ట‌న మిస్ట‌రీగా మారిన‌ది. రెండేండ్ల క్రితం ఉద్యోగం కోసం బ‌య‌ట‌కెళ్లి త‌మ కుమారుడు బ్ర‌హ్మానందం (22) తిరిగిరాలేద‌ని త‌ల్లిదండ్రులు నాగ‌ల‌క్ష్మీ, న‌ర‌సింహారావు దంప‌తులు ఆరోపిస్తూ ఉన్నారు. 2019 జులై 03న ఆఫీస్‌కు వెళ్లి మిస్సింగ్ అయ్యాడ‌ని, అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఇంటికి రాలేద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు.

ఆఫీస్‌లో మ‌ధ్యాహ్నం నుంచి బ‌య‌ట‌కు వెల్లిన‌ట్టు సీసీ పుటేజీలో రికార్డు అయింద‌ని, ఆ త‌రువాత బ్ర‌హ్మానందం ఫోన్ స్విచాఫ్ వ‌చ్చిన‌ద‌ని త‌ల్లిదండ్రులు చెప్పారు.  బ్ర‌హ్మానందం అదృశ్య‌మ‌వ్వ‌డానికి ముందు రెండు రోజులు ఆఫీస్‌కు వెళ్ల‌కుండా ఓ వ్య‌క్తి ఇంటికి వెళ్లిన‌ట్టు పోలీసులు నిర్ధారించారు. అయితే ఆ వ్య‌క్తి  కూతురుతో బ్ర‌హ్మానందం స‌న్నిహితంగా ఉన్నాడ‌ని పోలీసులు వెల్ల‌డించారు. పోలీసుల విచార‌ణ‌లో మాత్రం బ్ర‌హ్మానందం ఆచూకి ల‌భ్యం కావ‌డం లేదు. త‌మ చిన్న కుమారుడు ఏడేండ్ల‌కు అనారోగ్యంతో మృతి చెందాడ‌ని, ఇప్పుడు చేతికి వ‌చ్చిన కుమారుడు అనుమాన‌స్ప‌దంగా అదృశ్యం కావ‌డంతో  మా కుమారుడు బ‌తికి ఉన్నాడో లేదో చెప్పాల‌ని త‌ల్లిదండ్రులు రోధించ‌డం స్థానికుల‌ను కంట‌త‌డి పెట్టిస్తున్న‌ది. బ్ర‌హ్మానందం అదృశ్యం కేసు పూర్తి స్థాయి విచార‌ణ వివ‌రాల‌ను మాత్రం పోలీసులు వెల్ల‌డించ‌క‌పోవడం గ‌మనార్హం.

   

మరింత సమాచారం తెలుసుకోండి: