ద‌క్షిణాఫ్రికాలో ఇటీవ‌లే పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న త‌రుణంలో థ‌ర్డ్ వేవ్‌ను ఈ ప్ర‌పంచం ఎదుర్కోనున్న‌దా అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. తాజాగా బెంగ‌ళూరు ఎయిర్ ఫోర్ట్ లో క‌రోనా కేసులు వెలుగులోకి రావ‌డం దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి.  

 ద‌క్షిణాఫ్రికా నుంచి బెంగ‌ళూరు ఎయిర్‌ఫోర్ట్‌కు వ‌చ్చిన ఇద్ద‌రికీ క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. అధికారులు వీరిని వెంట‌నే బెంగ‌ళూరులోని ఓ ప్రయివేటు హోట‌ల్‌లో క్వారంటైన్‌లోకి త‌ర‌లించారు. ఒమిక్రాన్ వేరియంటేనా అనే అనుమానంతో నిర్థార‌ణ కోసం శాంపిల్స్‌ను ముంబ‌యి ల్యాబ్‌కు పంపారు. బెంగ‌ళూరులో క‌రోనా కేసులు న‌మోదు కావ‌డంతో ఆ రాష్ట్ర సీఎం బ‌స‌వ‌రాజు బొమ్మై అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని ఏర్పాటు చేసి ఒమిక్రాన్ వేరియంట్‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

ఈ వేరియంట్ మ‌రొక‌సారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంద‌ని.. ఒమిక్రాన్ డెల్టావేరియంట్ కంటే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైంద‌ని ఇప్ప‌టికే నిపుణులు హెచ్చించారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చ‌రిక జారీ చేసిన‌ది. ఇవాళ ఉద‌యం ప్ర‌ధానిమోడీ కూడా ఈ వేరియంట్‌పై ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించి అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని రాష్ట్రాల‌కు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు సూచ‌న‌లు కూడా చేసారు.మరింత సమాచారం తెలుసుకోండి: