సిరివెన్నెల సినిమా పేరును త‌న ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఎన్నో సూప‌ర్‌, డూప‌ర్ హిట్ పాట‌ల‌ను అందించిన ప్ర‌ముఖ తెలుగు సినీ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రీ తాజాగా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన సీతారామ‌శాస్త్రిని  కుటుంబ స‌భ్యులు కిమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం కిమ్స్ ఆసుప‌త్రిలో ఐసీయూ లో ఉంచి  మెరుగైన చికిత్స‌ను అంద‌జేస్తున్నారు.

ముఖ్యంగా గ‌త కొద్ది రోజుల నుంచి సిరివెన్నెల న్యూమోనియాతో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆ కార‌ణంతోనే సిరివెన్నెల అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అయితే సీతారామ‌శాస్త్రి తీవ్ర అనారోగ్య ప‌రిస్తితిలో లేర‌ని, ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ద‌ని.. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని సీతారామ‌శాస్త్రి కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు. సిరివెన్నెల‌  త్వరగా కోలుకోవాలని సినీ నటీనటులు, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కోరుతున్నారు. నిగ్గ దీసి అడుగు అనే గీతాన్ని స్వయంగా తానే రాసి నటించారు సిరివెన్నెల‌.  ఈ పాటకు రాష్ట్రప్రభుత్వంతో నంది అవార్డును అందుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: