పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు ముందు గాంధీ విగ్ర‌హం వ‌ద్ద కాంగ్రెస్ శ్రేణులు నిర‌స‌న చేప‌ట్టారు. లోక్‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాలు చేప‌ట్టిన త‌రుణంలోనే ర‌గ‌డ‌తోనే మొద‌ల‌య్యాయి పార్ల‌మెంట్ స‌మావేశాలు. విప‌క్షాల ఆందోళ‌న‌తో లోక్‌స‌భ వాయిదా ప‌డింది. మ‌ధ్యాహ్నం 12 గంటల‌కు లోక్‌స‌భ వాయిదా వేసారు. విప‌క్షాలు  ఆందోళ‌న చేప‌ట్ట‌డంతోనే స్పీక‌ర్ వాయిదా వేశారు. రైతుల స‌మ‌స్య‌ల‌ను స‌మ‌ర్చించాల‌ని విప‌క్ష నేత‌లు వెల్‌లోకి ప్ర‌వేశించారు. తెలంగాణ నుంచి  కాంగ్రెస్‌తో పాటు టీఆర్ఎస్ ఎంపీలు కూడా నిర‌స‌న‌తో వెల్‌లోకి వ‌చ్చారు.

ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేసారు. రైతుల స‌మ‌స్య‌లు, ఎంఎస్‌పీ పై చ‌ట్ట‌ప‌ర‌మైన హామీల‌ను ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా హాజ‌ర‌య్యారు. ప్ల‌కార్డుల‌తో  నిర‌స‌న తెలుపుతూ విప‌క్షాల నేత‌లు వెల్‌లోకి వ‌చ్చారు.  ముఖ్యంగా రైతుల స‌మ‌స్య‌ల‌పైనే చ‌ర్చించాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేసాయి. దీంతో పార్ల‌మెంట్‌లో ఒక్క‌సారిగా ర‌గ‌డ ర‌గిలింది. ఇవాళ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు లోక్‌స‌భ వాయిదా ప‌డింది.

మరింత సమాచారం తెలుసుకోండి: