కర్ణాటకలోని చామరాజ్నగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు చెందిన ఆరుగురు విద్యార్థులు, ఓ ఇంటర్నీకి కరోనా సోకిన‌ట్టు నిర్థార‌ణ అయింది. ఈ విద్యార్థులంద‌రూ కళాశాల వసతి గృహంలో ఉండటంతో కాస్త ఆందోళ‌న నెల‌కొంది.

క‌ర్ణాటక ధార్వాడ్ జిల్లాలోని ఎస్డీఎమ్ వైద్య కళాశాలలో కరోనా కలకలం సృష్టించిన కొద్ది రోజులకే.. మరో మెడికల్ క‌ళాశాల‌లో కోవిడ్‌-19 వ్యాప్తి చెందింది.  చామరాజ్నగర్ జిల్లాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు  చెందిన ఆరుగురు విద్యార్థులతో సహా ఓ ఇంటర్నీకి కొవిడ్  సోకిన‌ది.  వైరస్ సోకిన విద్యార్థులంద‌రినీ  జిల్లాలోని కొవిడ్  ఆసుప‌త్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వైరస్ బాధితులంద‌రూ  సీఐఎంఎస్లోని  వసతి గృహంలో ఉంటున్నారు అని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వరయ్య వెల్ల‌డించారు. సీఐఎంఎస్ వ‌స‌తి గృహంలో ఉన్న‌ 325 మంది విద్యార్థులకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అందులో ఆరుగురు విద్యార్థుల‌కు క‌రోనా సోకింద‌ని, మ‌రో 150 మందికి కూడా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని, ఫ‌లితాలు వెల్ల‌డి కావాల్సి ఉన్న‌ద‌ని వెల్ల‌డించారు. బాధితుల‌తో స‌న్నిహితంగా ఉఏన్న వారిని గుర్తించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: