చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీని చీట్ చేయ‌బోయి ఒక‌ కేటుగాడు క‌ట‌క‌టాల‌పాల‌య్యాడు. అయితే ఇదివ‌ర‌కే ప్ర‌భుత్వ నిధుల పేరుతో టోకరా వేయ‌బోయి నిందితుడు పోలీసుల‌కు చిక్కి బుక్ అయ్యాడు. గుంటూరులోని ర‌వీంద్ర‌న‌గ‌ర్‌లో నివాసం  ఉండే ఎమ్మెల్యే విడద‌ల ర‌జినీకి గ‌తంలో ఓ వ్య‌క్తి ఫోన్ చేసి.. తాను స‌చివాల‌యంలో ఉద్యోగం చేస్తున్నాన‌ని ప‌రిచ‌యం చేసుకున్నాడు. నియోజ‌క‌వ‌ర్గానికి రూ.2కోట్లు మంజూరు అయ్యాయ‌ని, రూ.25 ల‌క్ష‌ల చొప్పున మంజూరు చేస్తార‌ని న‌మ్మ‌బ‌లికాడు. ఇందుకోసంఒక్కో ల‌బ్దిదారుడు రూ.50,000 న‌గ‌దు చెల్లించాలి అని, మొత్తం ఎనిమిది మందికి క‌లిపి రూ.4 ల‌క్ష‌లు ఆర్టీజీఎస్ ద్వారా అర‌గంట‌లో త‌న ఖాతాకు పంపించాల‌ని.. లేదంటే చిలుకలూరిపేట నియోజ‌క‌వ‌ర్గానికి రుణాలు ద‌క్క‌కుండా పోతాయ‌నిపేర్కొన్నాడు.  

అయితే తాజాగా ఎమ్మెల్యే విడుద‌ల ర‌జినీకి కోవిడ్ నిధుల పేరుతో టోకారా చేసిన మోస‌గానికి కోర్టు శిక్ష వేసింది. సీఎంఓ కార్యాల‌యం ఉద్యోగి పేరుతో బాలాజీ అనే నిందితుడు మోస‌గించారు. కేవిడ్ కేంద్రం నిధులు రూ.2కోట్లు ఇప్పిస్తాను అని మోస‌గించాడు. గ‌తంలో ప‌ట్టాబిపురం పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసారు. నిందితుడు బాలాజీకి సంవ‌త్స‌రం పాటు జైలు శిక్ష‌తో పాటు రూ.1000 వ‌ర‌కు జ‌రిమానా విధించింది ఎక్సైజ్ కోర్టు.


మరింత సమాచారం తెలుసుకోండి: