హైద‌రాబాద్ న‌గ‌రంలోని అల్వాల్ లో  రియ‌ల్ట‌ర్ విజ‌య్ భాస్క‌ర్ రెడ్డి హ‌త్య‌కు గుర‌య్యారు. అయితే  తిరుమ‌ల‌గిరిలోని ఓ కారులో మృత‌దేహం ల‌భ్య‌మైన‌ది. నిన్న ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలో ఇంట్లో నుంచి బ‌య‌టికి వెళ్లాడు విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి. అయితే ఓ ప్లాట్ రిజిస్ట్రేష‌న్ కోసం రూ.10ల‌క్ష‌లు న‌గ‌దును కూడా తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం.
 
నిన్న ఉద‌యం విజ‌య్‌భాస్క‌ర్‌రెడ్డి హ‌త్యకు గురైన‌ట్టుగా తెలుస్తోంది. తిరుమ‌లగిరిలోని కారులో మృత‌దేహం ల‌భ్య‌మైన‌ట్టుగా స‌మాచారం. ఉద‌యం 11 గంట‌ల‌కు మర్డ‌ర్ చేసిన‌ట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ప్లాట్ రిజిస్ట్రేష‌న్ లో మ‌ధ్య‌వ‌ర్తులే అత‌నిని చంపిన‌ట్టుగా అనుమానం వ్య‌క్తు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌రు అనుమానితుల‌ను తిరుమ‌ల‌గిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి బంధువు తోట న‌రేంద‌ర్ రెడ్డి, మ‌రో వ్య‌క్తి అబ్ర‌హంపై  విజ‌య్‌భాస్క‌ర్‌రెడ్డి కుటుంబ స‌భ్యులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు కళ్ల ముందే క‌నిపించిన విజ‌య్‌భాస్క‌ర్‌రెడ్డి ఒక్క‌సారిగా లేర‌న‌డానికి న‌మ్మ‌శ‌క్యంగా లేద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: