విద్యార్థుల త‌ల్లుల ఖాతాలో నేరుగా రూ.686 కోట్లు జ‌మా చేసిన‌ట్టు సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఇవాళ మీడియాతో సీఎం మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 11 ల‌క్ష‌ల 3వేల  మంది విద్యార్థుల‌కు పూర్తిగా ఫీజు రీయంబ‌ర్స్ మెంట్ విడుదలైన‌ట్టు సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. నెల్లూరు జిల్లాలో పాద‌యాత్ర జ‌రుగుతున్న స‌మ‌యంలో   ఓ ఇంట్లో నుంచి అమ్మ‌నాన్న‌లు ఇద్ద‌రు వ‌చ్చి ఫీజులు చెల్లించ‌లేని ప‌రిస్థితిలో ఉండ‌డంతో ఆ విద్యార్థి మృతి చెందాడ‌ని త‌న దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడే నేను నిర్ణ‌యించుకున్నాను. ఇలాంటి ప‌రిస్థితి రాష్ట్రంలో ఎవ‌రికీ రావ‌ద్ద‌ని సీఎం జ‌గ‌న్ వెల్ల‌డించారు.

పూర్తి ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్ కార్య‌క్ర‌మాన్ని తీసుకురావ‌డం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు. జ‌గ‌న‌న్న విద్యాదీవెన ప‌థ‌కం కింద  అర్హులైన పేద విద్యార్థులంద‌రికీ అంద‌జేస్తున్నాం. ఏ కోర్సు అయినా చ‌దివే విద్యార్థుల‌కు అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు జ‌గ‌న్‌. పేద విద్యార్థుల త‌ల్లిదండ్రుల ఖాతాలో ప్ర‌తీ మూడు నెల‌ల‌కొక‌సారి జ‌మ చేసి.. క‌ళాశాల ప‌రిస్థితులు, వ‌స‌తులు త‌ల్లిదండ్రులు చూసి, ఫీజుల‌ను చెల్లించే బాధ్య‌త‌ను త‌ల్లులు అప్ప‌గించాం. ఫీజుల‌ను వారే చెల్లించడంతో పిల్ల‌లు ఏ విధంగా చ‌దువుతున్నార‌ని, క‌ళాశాల‌లో ఉన్న వ‌స‌తులు అన్ని ప‌రిశీలించి లోటు పాట్ల‌ను యాజ‌మాన్యాలను ప్ర‌శ్నించేవిధంగా వెసులు బాటు ఉంటుంది. దీంతో  క‌ళాశాల‌లో ప‌రిస్థితులు బాగాలేన‌ప్ప‌డు  తల్లులు యాజ‌మాన్యానికి తెలియ‌జెప్ప‌డంతో పాటు 190కు ఫోన్‌చేస్తే ప్ర‌భుత్వం క‌ల్పించుకొని మార్పు చేసే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: