ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో  ఇండ్లు లేని పేదలు ఉండకూడనే ఉద్దేశంతో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇండ్ల‌ నిర్మాణానికి మార్గం సుగుమమైంది. రాష్ట్రంలోని పేదలందరికీ ఇల్లు పథకంపై హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును మంగళవారం డివిజన్‌ బెంచ్‌ రద్దు చేసిన‌ది.  ఇండ్ల‌ స్థలాలపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను తాజాగా పిటిషనర్లు వెనక్కి తీసుకున్నారు.

కాగా గత నెల 8వ తేదీన పేదలందరికీ  ఇండ్ల స్థలాలు పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాలో ఎటువంటి నిర్మాణాలు  చేప‌ట్ట‌వ‌ద్ద‌ని హైకోర్టు సింగిల్‌ బెంచ్ తీర్పు ఇచ్చిన‌ విషయం  విధిత‌మే. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ  డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన‌ది ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన బెంచ్ పేద‌ల ఇండ్ల నిర్మాణానికి మార్గం సుగ‌మం చేసింది.  హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్టు తాజాగా  డివిజన్‌ బెంచ్‌ వెల్లడించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: