కేసీఆర్‌కు పిచ్చిముదిరింది. ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి కేంద్ర మంత్రి ప‌ట్ల ఎలాంటి వ్యాఖ్య‌లు చేసార‌ని ప్ర‌శ్నించారు. సిగ్గు.. ల‌జ్జా లేదా.. నా కొడుకా.. వంటి ప‌దాలు వాడ‌డం ఏమిట‌ని..  ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి   ఇలాంటి భాష మాట్లాడుతారా.. తెలంగాణ ప్ర‌జ‌లు వాడే భాష‌నా.. ఇది సీఎం భాష‌నా అని ప్ర‌శ్నించారు బండి సంజ‌య్‌.

ముఖ్య‌మంత్రి జాగ్ర‌త్త ఉండు. ఢిల్లీకి వెళ్లి వ‌చ్చాక కేసీఆర్‌కు పిచ్చి ఇంకా ముదిరింది. సీఎం కేసీఆర్ తీరును అంద‌రూ ఛీ కొడుతున్నారు.సీఎం ప‌ద‌వీలో ఉన్న ఓ వ్య‌క్తి దిగ‌జారి ఓకేంద్ర మంత్రిపై నోరు పారేసుకున్నారు. ముడి బియ్యం కొంటామ‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఇప్ప‌టికే చెప్పార‌ని బండి సంజ‌య్ వెళ్ల‌డించారు. అయినా కొంట‌వా లేదా చెప్పాల‌ని సీఎం కేసీఆర్ ఎందుకు అడుగుతున్నార‌ని బండి ప్ర‌శ్నించారు.  తెలంగాణ రైంతాగం పండించిన పంట‌ను కొని తీరాల‌ని డిమాండ్ చేసారు బండి. రైతులు పండించిన ధాన్యాన్ని ప‌క్కా కొనాల‌ని పేర్కొన్నారు. కేసీఆర్ కుట్ర ప‌న్ని కొనుగోలు కేంద్రాల‌ను బంద్ చేయాల‌ని చూస్తున్నారు. ఎట్లా బంద్ చేస్త‌వ్‌.. ఎందుకు బంద్ చేస్త‌వ‌ని బండి సంజ‌య్ ప్ర‌శ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: