తెలంగాణలో వ‌రి వార్ కొన‌సాగుతూనే ఉన్న‌ది. సోమ‌వారం సీఎం కేసీఆర్ విలేక‌ర్ల స‌మావేశంలో బీజేపీ నేత‌ల‌పై విరుచుకుప‌డితే.. ఇవాళ తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మీడియా స‌మావేశంలో కేసీఆర్ పై విమ‌ర్శ‌లు చేసారు. నిన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌పంచ ఆక‌లి సూచి నివేధిక‌ను భార‌త్ స్థానం 101 అని, పాకిస్తాన్ స్థానం 92 అని, బంగ్లాదేశ్‌, నేపాల్ స్థానం 76 అని వెల్ల‌డించాడు. మ‌రీ నేపాల్‌లో జ‌నాభా 3 కోట్లు.. పాకిస్తాన్  జ‌నాభా 24 కోట్లు.. యూపీ రాష్ట్రం 24 కోట్లు.. తెలంగాణ‌లో ఎన్ని కోట్ల జ‌నాభా ఉందో  తెలుసుకో అని ప్ర‌శ్నించారు.

పాకిస్తాన్ మీద కేసీఆర్‌కు అంత ప్రేమ పుడుతుంది ఎందుక‌ని ప్ర‌శ్నించారు. నిఘా సంస్థ‌లు ఓ క‌న్ను వేయాల‌ని పేర్కొన్నారు బండి సంజ‌య్‌. ఈ మ‌ధ్య పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల‌పై ప్రేమ క‌న‌బ‌రుస్తున్నారు. నీ నిర్వాహ‌కం, నీ కొడుకు నిర్వాహ‌కం వ‌ల్ల రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌రు.  పాత‌బ‌స్తీలో 70 శాతం మంది క‌రెంట్ బిల్లు చెల్లిస్త‌లేర‌ని స్ప‌ష్టం చేసారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించ‌డానికి అని పేర్కొన్నారు బండి సంజ‌య్‌. పండించిన ప్ర‌తీ గింజ‌ను కొంటాన‌ని సీఎం కేసీఆర్ పేర్కొని.. ఇప్పుడూ పూట‌కొక మాట మాట్లాడ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు సంజ‌య్‌.
 

మరింత సమాచారం తెలుసుకోండి: