ఇత‌ర రాష్ట్రాల‌లో లేని స‌మ‌స్య తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వ‌స్తుంద‌ని సీఎం కేసీఆర్ చెప్పాల‌ని పేర్కొన్నారు బండి సంజ‌య్‌. సీఎం కేసీఆర్ జాగ్ర‌త్త‌గా మాట్లాడాల‌ని, ముడి బియ్యం కొంటాం అని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి చెప్పార‌ని గుర్తుకు చేసారు.  వానాకాలంలో ఎలా పంట‌ను కొంటున్నావో.. యాసంగిలో కూడా అదేవిధంగా పంట‌ను కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేసారు. ఇవాళ ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడారు బండి సంజ‌య్‌.

కేంద్ర ప్ర‌భుత్వం యాసిడ్ టెస్ట్ పెట్టింది. యాసిడ్ పోసి టెస్ట్ చేస్తే.. ఈ రైస్ ఎక్క‌డి నుంచి వ‌చ్చింద‌ని.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి భ‌య‌ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. గ‌తంలో బియ్యాన్ని తీసుకొచ్చి గోదాముల‌లో నింపాడ‌ని, రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త నాట‌కానికి తెర‌లేపాడని.. ఇది నిజ‌మ‌ని చెప్పారు. వ‌రంగ‌ల్, సూర్య‌పేట‌, నిజామాబాద్‌లో బియ్యం దొరికాయని.. టీఆర్ఎస్ అనుచ‌రులే ఈ  దందా చేస్తున్నార‌ని పేర్కొన్నారు. కేసీఆర్ చేసే గొడ‌వ అంతా రైస్ మిల్ల‌ర్ల కోస‌మేన‌ని స్ప‌స్టం చేసారు బండి సంజ‌య్‌.

క‌నీసం ప్ర‌ణాళిక లేదని, కేంద్ర ప్ర‌భుత్వం కొన‌బోమ‌ని చెప్పిన‌ప్పుడూ రాష్ట్ర రైతుల‌ను నువ్వు సూచ‌న‌లు ఇవ్వాలా వ‌ద్దా.. కొనుగోలు కేంద్రాలను ఎందుకు బంద్ చేస్తానంటున్న‌వ్‌.. తెలంగాణలో 5 ర‌కాల విత్త‌నాలు ఉన్నాయి. అవి తీసుకొచ్చి తెలంగాణ రైతుల‌కు ఇస్తే.. కేంద్రం త‌ప్ప‌కుండా కొంటుంది. బాయిల్డ్ రైస్ మీద ప్రేమ ఉన్న‌ది  రాష్ట్ర ప్ర‌భుత్వానికి అని చెప్పారు. 7 ర‌కాల విత్త‌నాలు ఉన్నాయ‌ని చెప్పావు.. మ‌రీ బాయిల్డ్ రైస్ కాకుండా ఆ విత్త‌నాల‌ను రైతుల‌కు అంద‌జేస్తే కేంద్రం కొంటుంది స‌మ‌స్యే ఉండ‌దు క‌దా అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: