సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి  తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించిందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన మృతి సినిమా రంగానికి తీరని లోటని వ్యాఖ్యానించారు చంద్ర‌బాబు.  అంచలంచెలుగా ఎదిగిన ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. తన పాటలతో తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని టీడీపీ అధినేత  చెప్పారు.

దాదాపు  మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో 3 వేలకు పైగా పాటలు రాసి కోట్లాది మంది ప్రేక్షకులను సిరివెన్నెల‌ ఆకట్టుకున్నారన్నారు. తన పాటలతో ప్రజలలో చైతన్యం తీసుకువచ్చారని, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చంద్రబాబు ప్ర‌క‌టించారు. సిరివెన్నెల వ్య‌క్తి గ‌తంగా కూడా ఎంతో మంచి వాడ‌ని, ఎవ‌రినైనా ఎంతో ఆప్యాయ‌త‌గా ప‌ల‌క‌రించి.. చ‌క్క‌ని ఆలోచ‌న‌లు పంచుకునే వాడు అని తెలిపారు. దాస‌రి నారాయ‌ణ రావు గురించి ఎలా చెప్పుకునే వారో సిరివెన్నెల గురించి అలా చెప్పుకుంటారు అని చెప్పారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: