తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ గొప్ప‌ సాహిత్య‌వేత్త సిరివెన్నెల సీతారామశాస్త్రి మ‌ర‌ణించడం చాలా బాధ క‌లిగించింద‌ని భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌క‌టించారు.   సిరివెన్నెల మృతి ప‌ట్ల నరేంద్ర‌మోడీ సంతాపం ప్ర‌క‌టించారు. తెలుగు భాష ప్రాచుర్యానికి సిరివెన్నెల ఎంతో కృషి చేసార‌ని పేర్కొన్నారు మోడీ. ఆయ‌న ర‌చ‌న‌ల్లో  క‌విత్వ ప‌టిమ ఉంటుంది. సిరివెన్నెల సీతారామాశాస్త్రి బ‌హుముఖ ప్ర‌జాశీలి అని కొనియాడారు ప్ర‌ధాని.

 ఆయ‌న మృతి త‌న‌ను ఎంత‌గానే బాధించింద‌ని వెల్ల‌డించారు. అలుపెరుగక రాసిన ఆయన కలం ఆగిపోయింద‌ని.. ఆయ‌న మృతి చెందిన వార్త‌ను ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు తెలిపార‌ని గుర్తు చేసారు మోడీ. న్యూమోనియాతో బాధపడుతూ ప్రముఖ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇవాళ సాయంత్రం 4 గంట‌ల 7 నిమిషాల‌కు మృతి చెందార‌ని వెల్ల‌డించిన‌ట్టు పేర్కొన్నారు. ఇప్ప‌టికే సిరివెన్నెల మృతి ప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు సంతాపాన్ని ప్ర‌క‌టిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: