సిరివెన్నెల మృతి చెందార‌ని తెలియ‌గానే సీఎం కేసీఆర్ వెంట‌నే ట్విట్ట‌ర్‌లో నిన్న సాయంత్రం సంతాపం ప్ర‌క‌టించారు. సీఎంతో పాటు మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్‌రావు, నిరంజ‌న్‌రెడ్డి త‌దిత‌రులు సంతాపాన్ని తెలియ‌జేసార‌ని త‌ల‌సారి గుర్తుకు చేసారు. ఇవాళ తెలంగాణ ప్ర‌భుత్వం త‌రుపున అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌రావు ఫిల్మ్‌ఛాంబ‌ర్ వ‌ద్ద‌కు చేరుకుని సిరివెన్నెల పార్థివ‌దేహాన్ని సంద‌ర్శించి.. ఆయన కుటుంబస‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేసారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు త‌ల‌సాని.
 
సిరివెన్నెల చిత్రానికి ఆయ‌నకు అప్ప‌ట్లోనే నంది అవార్డు రావ‌డం గొప్ప విష‌య‌మ‌ని మంత్రి త‌ల‌సాని పేర్కొన్నారు. యావ‌త్ తెలుగు వాళ్లు బాధ‌ప‌డే సంద‌ర్భం అని పేర్కొన్నారు. వాళ్ల కుటుంంబ స‌భ్యుల‌కు భ‌గ‌వంతుడు ఆద‌ర్శంగా తీసుకొని, వారు ఏవిధమైన‌టువంటి పాటు రాసారో అర్థం, ప‌ర‌మార్థం ఉంటుంది. పాత చిత్రాలు కూడా అర్థాలు, ప‌ర‌మార్థాలుంటాయ‌ని పేర్కొన్నారు. వారు చ‌నిపోవ‌డ‌మ‌నేది కేవ‌లం వారి కుటుంబానికి మాత్ర‌మే లాస్ కాదు.. తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ లాస్ అని చెప్పారు. తెలంగాణ ప్ర‌భుత్వ త‌రుపున సంతాపం తెలియ‌జేస్తూ.. వారి కుటుంబానికి ధైర్యం ఇవ్వాల‌ని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ స్పష్టం చేసారు.  ముఖ్యంగా తెలుగు చిరంజీవి, నాగార్జున, బాల‌కృష్ణ‌, వెంట‌కేష్‌, మ‌హేశ్‌బాబు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు అంద‌రూ ఒక్కొక్క‌రుగా చేరుకొని సంతాపాన్ని తెలియ‌జేస్తున్నారు సీతారామ‌శాస్త్రికి.



మరింత సమాచారం తెలుసుకోండి: