తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసు రోజు రోజుకూ ఓ  కీలక మలుపు తిరుగుతూనే ఉన్నది.  ఓ వైపు సీసీఎస్ నుంచి ద‌ర్యాప్తు.. మ‌రోవైపు ఏసీబీ విచార‌ణ చేప‌డుతుంది. సుమారు రూ.65కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను దోచుకున్న వెంక‌టసాయికుమార్ తో పాటు 18 మంది నిందితుల‌ను ఏసీబీ విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ది. అయితే తెలుగు అకాడ‌మి ఏవో ర‌మేష్ తో పాటు కొంద‌రూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర‌పై పలువురు అనుమానం వ్య‌క్తం చేస్తోంది ఏసీబీ. అదేవిధంగా ప్ర‌భుత్వ బ్యాంకు అధికారుల పాత్ర‌పైనా ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్న‌ది. మూడు ఎఫ్ఐఆర్ ల‌ను ఇప్ప‌టికే సీసీఎస్ పోలీసులు ఏసీబీకి అందించినారు.

అయితే తాజాగా తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో మరొకరిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసారు. 12వ నిందితుడు అయిన యోహాన్ రాజు భార్య ప్రమీలారాణి అరెస్ట్ అయ్యారు.   విజయవాడలో ప్రమీలారాణిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా తెలుగు అకాడమీ నిధుల రికవరీపై  దృష్టి పెట్టారు పోలీసులు. విశాఖ శివారుల‌లో ప్ర‌ధాన సూత్ర‌దారులు చుండూరు వెంక‌ట సాయికుమార్‌, నండూరి వెంక‌ట‌ర‌మ‌ణ‌లు క‌లిసి ప్లాట్లు కొనుగోలు చేసిన‌ట్టు ఇప్ప‌టికే గుర్తించారు. ప్లాట్ల కొనుగోలుకు సంబంధించి చెల్లింపుపై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు.



 

మరింత సమాచారం తెలుసుకోండి: