హైద‌రాబాద్ న‌గ‌రంలోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఓ దారుణ‌మైన ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. ఓ బాలుడిపై యువ‌తి లైంగిక‌దాడికి పాల్ప‌డ‌డ‌మే కాకుండా.. అత‌న్ని బెదిరించి రూ.16ల‌క్ష‌ల సొత్త‌ను కాజేసుకుని ఉడాయించింది. వివరాల్లోకి వెళ్లితే.. టోలిచౌకీలో నివాసం ఉండే కుటుంబం ఇటీవ‌ల జూబ్లీహిల్స్ కు మారిన‌ది. అయితే ఇల్లు స‌ద్దుతున్న త‌రుణంలో 20 తులాల బంగారం క‌నిపించలేదు.ఎంత వెతికినా ఆచూకి ల‌భించ‌డంతో త‌ల్లి తొమ్మిదోత‌ర‌గ‌తి చ‌దువుతున్న కుమారుడిని ప్ర‌శ్నించింది. విస్తుపోయే విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆ బంగారం తీసింది తానే అని స‌మాధానం చెప్ప‌డంతో త‌ల్లి కాసేపు ఆశ్య‌ర్యానికి గురైంది.

ఆ బంగారాన్ని మాత్రం తండ్రికి ద‌గ్గ‌ర బంధువు అయిన ఓ యువ‌తికి ఇచ్చాను అని బాలుడు వెల్ల‌డించాడు. ఆ యువ‌తి తాను చ‌దువుకునే పాఠ‌శాల వ‌ద్ద‌కు చేరుకొని త‌నను ఓలాడ్జీకి తీసుకెళ్లింద‌ని.. అప్పుడు త‌న కోరిక తీర్చాల‌ని.. త‌న‌పై లైంగిక దాడికి పాల్ప‌డింద‌ని చెప్పాడు. ఆ స‌మ‌యంలో ఆ యువ‌తి మాజీ ప్రియుడితో క‌లిసి వీడియో తిసింద‌ని, ఆ త‌రువాత ఆ వీడియో చూపించి బెదిరించ‌డంతో త‌ప్ప‌నిసరి పరిస్థితిలో ఇంట్లో ఉన్న 20 తులాల బంగారంతో పాటు ల‌ల‌క్ష న‌గ‌దును కూడా ఇచ్చిన‌ట్టు బాలుడు  పేర్కొన్నాడు. త‌న కుమారుడిపై లైంగిక‌దాడికి పాల్ప‌డిన యువ‌తిని వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని త‌ల్లి కోరిన‌ది. దాదాపు మూడేండ్ల క్రితం ఈ ఘ‌ట‌న జ‌రుగ‌గా తాజా బంగారం పోవ‌డంతో వెలుగులోకి వ‌చ్చింది.  వారికి బంధువు అయిన ఆ యువ‌తిపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలిపారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: