ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న ఓమిక్రాన్ భార‌త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ద‌ని.. క‌ర్నాట‌క‌లో రెండు కేసులు న‌మోదు అయిన‌ట్టు సీఎం  బసవరాజు బొమ్మై స్ప‌ష్టం చేసారు. ముఖ్యంగా విప‌రీత‌మైన అల‌స‌ట‌, కండ‌రాల నొప్పులు, గొంతులో గ‌ర‌గ‌ర‌, పొడిద‌గ్గు, కొంత‌మందిలో మాత్రం జ్వ‌రం వంటి ల‌క్ష‌ణాలున్నాయ‌ని డాక్ట‌ర్లు పేర్కొన్న‌ట్టు సీఎం వెల్ల‌డించారు. నిన్న ఇద్దరికి  క‌ర్నాట‌క‌లో ఒమిక్రాన్ వ్యాధి నిర్ధారణ అయిన‌ట్టు వెల్ల‌డించారు. ఇద్ద‌రికి ప్రైమ‌రీ, సెకండ‌రీ కాంటాక్టును గుర్తించ‌డం మొద‌లు పెట్టామ‌ని స్ప‌ష్టం చేసారు సీఎం.

ముఖ్యంగా వారిద్ద‌రికీ ఆ వ్యాధి ఎలా వ‌చ్చింద‌ని, ఎవ‌రి ద్వారా సోకింద‌నే విష‌యంపై విచార‌ణ కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు. బ‌య‌టి దేశాల‌లో ఏవిధమైన మందులు వాడుతున్నార‌ని, ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నారో ఆ విధ‌మైన ప్రోటోకాల్ ఇక్క‌డ పాటిస్తాం అని సీఎం చెప్పారు. ఓమిక్రాన్ నియంత్ర‌ణ‌కు అన్నీ చ‌ర్య‌లు తీసుకుంటున్నాం అని స్ప‌ష్టం చేసారు క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజు బొమ్మై. 


మరింత సమాచారం తెలుసుకోండి: