ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌చివాల‌యంలో ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో ఆర్ధిక‌,సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శులు రావ‌త్,శ‌శి భూష‌ణ్ కుమార్ జాయింట్ స్టాప్ కౌన్సిల్ స‌మావేశం నిర్వ‌హించారు. పీఆర్‌సీ నివేదిక‌ను ఇవ్వాల‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు ఇవ్వాళ కార్య‌ద‌ర్శుల‌ను ఇవ్వాల‌ని కోరారు. అందుకు పీఆర్సీ నివేదిక‌లో ఉన్న అంశాల‌ను సాంకేతికంగా అధ్య‌య‌నం చేయాల్సి ఉంద‌ని.. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో నివేదిక ఇవ్వ‌లేమ‌ని కార్య‌ద‌ర్శులు స్ప‌ష్టం చేసారు. అయితే తిరుప‌తిలో పీఆర్సీపై సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేసార‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు గుర్తుకు చేసారు. ఇవాళ తిరుప‌తిలో సీఎం జ‌గ‌న్ ఇచ్చిన హామీతో 10 రోజుల్లో పీఆర్సీని ప్ర‌క‌టిస్తామ‌ని కార్య‌ద‌ర్శిలు వెల్ల‌డించారు.

  ఈ స‌మావేశంలో ఉద్యోగ సంఘాలకు నిరుత్సాహం మిగిలింద‌ని పేర్కొంటున్నారు.  కార్య‌ద‌ర్శిలు అధ్య‌య‌న క‌మిటీ వేసార‌ని, ప్ర‌త్యేకంగా పిలిచార‌ని, మేము ఆశించామ‌ని.. కుటుంబానికి న‌లుగురుని యూనిట్‌గా తీసుకోవాలి. కేవ‌లం ముగ్గురిని మాత్ర‌మే యూనిట్‌గా తీసుకుంటున్నారు. పీఆర్సీ నిర్ణ‌యం అనేది అనుకూలంగా లేదని ఉద్యోగ సంఘాల‌ నేత‌లు పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: