కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, రాజ‌కీయ కురువృద్ధుడు, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి రోశ‌య్య మృతి ప‌ట్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సంతాపం ప్ర‌క‌టించారు. రోశ‌య్య వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి ఎంతో స‌న్నిహితంగా ఉండేవార‌ని గుర్తు చేసారు. తొలిత‌రం, స్వాతంత్ర స‌మ‌ర యోధుల ఆలోచ‌న విధానాన్ని అవ‌లంభించే వారు అని పేర్కొన్నారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.

ఉమ్మ‌డి రాష్ట్రానికి సీఎంగా, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌గా ప‌ని చేసిన రోశ‌య్య ఏ రంగంలోనైనా త‌న బాద్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించే వారు. ఉమ్మ‌డి ఏపీలో దాదాపు 16 సార్లు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన ఆర్థిక మంత్రిగా రోశ‌య్య చ‌రిత్ర సృష్టించారు అని  ప్ర‌క‌ట‌న ద్వారా వెల్ల‌డించారు సీఎం జ‌గ‌న్‌.  తనకప్పగించిన ఏ బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వహించేవారని కొనియాడారు సీఎం. ముఖ్యంగా రైతు నేత ఎన్టీ రంగా ప్రియ శిష్యుడు కొనిజేటి రోష‌య్య  అని గుర్తు చేసారు. ఇప్ప‌టికే రోశ‌య్య మృతి ప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ నేత‌లు తీవ్ర దిగ్బ్రాంతిని వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: